పచ్చదనం – పరిశుభ్రతపై శిక్షణ
దుర్గి, అక్టోబర్ 16, రాజధాని వాయిస్ : మండల పరిషత్ కార్యాలయంలో గురువారం థీమ్ 5, క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ పై క్లాప్, షెడ్ మిత్రాలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీడీవో సుగుణ మాట్లాడుతూ, మన గ్రామాలను మనమే శుభ్రపర్చుకోవాలని అన్నారు.గ్రామాల్లో పరిశుభ్రత పాటించటం వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయని,ప్రజలందరూ ఆరోగ్య వంతమైన జీవితం గడపవచ్చని సూచించారు.గ్రీన్ అంబాసిడర్లకు తడి,పొడి చెత్త విడిగా అందజేయాలని ఆమె అన్నారు.అనంతరం మండల గ్రీన్ అంబాసిడర్లు దుర్గి షెడ్ దగ్గరకు వెళ్ళారు. ఈకార్యక్రమంలో ఏవో శివప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు.



Post Comment