రాష్ట్ర వాలీబాల్ టీం.. కోచ్ గా… బండారి రాజేష్ నియామకం పట్ల హర్షం
(ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పసిఫిల్ మున్నా ), ఆత్మకూరు: యూత్ గేమ్స్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్ షిప్ 2025 కి లెవెల్ 2 వాలీబాల్ కోచ్ నక్క శ్రీనివాస్ రావు సారథ్యంలో రాష్ట్ర వాలీబాల్ టీమ్ కోచ్ గా ఆత్మకూర్ పట్టణం లోని ఇందిరానగర్ కి చెందిన సీనియర్ క్రీడాకారుడు బండారి రాజేష్ నియామకం హర్షనీయమని ఆత్మకూర్ స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పస్పిల్ మున్నా తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆత్మకూర్ పట్టణంలోని ఆత్మకూర్ స్పోర్ట్స్ క్లబ్ కార్యాలయం నందు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా నంద్యాల జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి MNV.రాజు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులకు అన్ని విధాలుగా అవకాశం అందిస్తున్న గొప్ప సంస్థ ఆత్మకూర్ స్పోర్ట్స్ క్లబ్ అని కొనియాడారు.రాబోయే రోజుల్లో తప్పకుండా ఆత్మకూర్ క్రీడాకారులకు అన్ని విధాలుగా అవకాశం కల్పిస్తామన్నారు. సీనియర్ క్రీడాకారుడు బండారి.రాజేష్ మాట్లాడుతూ నాకు జాతీయ స్థాయి లో రాష్ట్రస్తాయి వాలీబాల్ టీమ్ కి కోచ్ గా అవకాశం కల్పించిన శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ.బుడ్డా రాజశేఖర్ రెడ్డి కి మరియు ఆత్మకూర్ స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పస్పిల్ మున్నా కి ఆత్మకూర్ వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ నిమ్మి.కృష్ణ యాదవ్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా వృత్తి నైపుణ్య అభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఆత్మకూర్ స్టేడియం ఖోఖో కోచ్ మహేబూబ్ పాల్గొన్నారు*



Post Comment