ముస్లీం సమైక్య వేదిక ఆద్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
ముస్లిం సమైక్య వేదిక ఆద్వర్యంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
రాజధానివాయిస్:నవంబర్ 11,నరసరావుపేట.
స్వాతంత్ర్య సమరయోధులు భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రి, భారతరత్న డాక్టర్ జనాబ్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ 138 వ జయంతి వేడుకలు రెవిన్యూ భవన్ కలెక్టరేట్ నందు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం సమైక్య వేదిక జిల్లా అధ్యక్షుడు హాఫిజ్ అబ్దుల్ బసిత్.ఈ సందర్బంగా సమైక్య ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూమౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యా రంగానికి బాటలు వేసిన మహానుభావుడని, విద్యే సాంఘిక సమానత్వానికి మూలం అని,హిందూ–ముస్లిం ఐక్యతకు మార్గదర్శకుడు ఆజాద్ అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు హాఫిజ్ అబ్దుల్ బసిత్, ఉపాధ్యక్షులు మౌలానా ఉమర్ ఫారూఖ్, జిల్లా కార్యదర్శి జిలాని, జిల్లా యువత అధ్యక్షులు గౌస్ ఖాజా, నియోజవర్గ అధ్యక్షుడు పటాన్ రియాజ్ ఖాన్, కార్యదర్శి రియాజ్, యువత నియోజకవర్గ అధ్యక్షులు నూర్ అహ్మద్, పట్టణ అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ యాసీన్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



Post Comment