జాతీయ సైన్స్ పరీక్షకు అర్హత సాధించిన వివేకానంద పాఠశాల విద్యార్థి

జాతీయ సైన్స్ పరీక్షకు అర్హత సాధించిన వివేకానంద పాఠశాల విద్యార్థి

రాజధాని వాయిస్:నవంబర్ 10,పిడుగురాళ్ల.

పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఎదురుగా గల వివేకానంద పాఠశాల విద్యార్థిని షేక్ హలీమా సాధియ ఆల్ ఇండియా సైన్స్ పోటీ పరీక్ష లో లెవెల్1 అర్హత సాధించిన సందర్భంగా డైరెక్టర్ రామకృష్ణ మాస్టారు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా రామకృష్ణ మాష్టార్ మీడియాతో మాట్లాడుతూ జాతీయ స్థాయి సైన్స్ పరీక్షలో వివేకానంద పాఠశాల విద్యార్థి అర్హత సాధించడం గర్వంగా ఉందని,పాఠశాల విద్యార్థులను అన్నీ విషయాలలో తర్పీదు ఇస్తున్నామని,పోటీ పరీక్షలు ఎక్కడ నిర్వహించిన వివేకానంద పాఠశాల విద్యార్థులు జిల్లా,రాష్ట్ర,జాతీయ స్థాయుల్లో రాణిస్తున్నారన్నారు.

Post Comment

You May Have Missed

0Shares