తుఫాను రీత్యా లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయండి
కలెక్టర్ వినోద్ కుమార్
అక్టోబర్ 24
రాజధాని వాయిస్:బాపట్ల.
ఇటీవల బాపట్ల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులకు ఆదేశించారు. రోడ్లు మరియు పొలాలు దెబ్బతిన్న ప్రదేశాలలో తక్షణమే వాటిపై తగుచర్యలు చేపట్టాలని అన్నారు. ఎక్కువగా నీరు నిలుచున్న ప్రాంతాలను గుర్తించి ఆ నీటిని తక్షణమే నిల్వ ఉండకుండా పోయే దిశగా చూడాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా వ్యవసాయ అధికారులు తక్షణమే ముంపుకు గురైన రైతులను గుర్తించి వారిని ముఖాముఖంగా కలిసి వారి పొలాల్లో నీళ్లు నిలవకుండా ఉంచుటకు మార్గాలని ఏర్పాటు చేయాలని పలువురు అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు



Post Comment