మాచర్ల నూతన సీఐ వెంకటరమణకు శుభాకాంక్షలు తెలిపిన..

 ప్రముఖ న్యాయవాది& జనసేన నేత బత్తుల బాబురావు

రాజధాని వాయిస్: అక్టోబర్ 24.

మాచర్ల పట్టణానికి నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన వెంకటరమణకు జనసేన పార్టీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది బత్తుల బాబురావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన సీఐని కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.సీఐ వెంకటరమణ పదవిలో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని బత్తుల బాబురావు ఆకాంక్షించారు. ముఖ్యంగా,పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారి సమస్యల పట్ల మానవతా దృక్పథంతో స్పందించాలని విజ్ఞప్తి చేశారు.పోలీసు వ్యవస్థ పట్ల ప్రజలకున్న గౌరవాన్ని మరింత పెంచే విధంగా, చట్టం అందరికీ సమానమనే స్ఫూర్తితో ఆయన పనిచేయాలని బాబురావు ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుంటుందని, మాచర్ల పట్టణానికి, ప్రజలకు మేలు జరిగే ఏ కార్యక్రమానికైనా జనసేన పార్టీ నాయకులుగా, న్యాయవాదిగా తమ పూర్తి సహకారం పోలీసు విభాగానికి ఎల్లప్పుడూ అందిస్తామని ఈ సందర్భంగా బత్తుల బాబురావు తెలియజేశారు.

Post Comment

You May Have Missed

0Shares