డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కల్సిన ఎమ్మెల్యే సత్యానందరావు
రాజధాని వాయిస్:అక్టోబర్ 23,కొత్తపేట.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మర్యాదపూర్వకంగా కలిసారు. కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతున్న కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవాలని, రావులపాలెం జాతీయ రహదారి నుంచి వాడపల్లి వరకు ఏటిగట్టు రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో 12 రోడ్ల నిర్మాణం కోసం 18.33 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. గోదావరి డెల్టా ఆధునీకరణ పనులకు నిధుల మంజూరుకు కృషి చేయాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయా అంశాల పట్ల సానుకూలంగా స్పందించారు.



Post Comment