పల్నాడులో పిడుగు పడి గేదె మృతి
రాజధానివాయిస్:అక్టోబర్ 22,క్రోసూరు.
పల్నాడు జిల్లా, క్రోసూరు మండల పరిధిలోని ఉయ్యందన గ్రామంలో లేళ్ల సత్యనారాయణ కు చెందిన పాడి గేదె మీద పిడుగు పడి మృతి చెందింది. గేదె విలువ సుమారు 90 వేల వరకు ఉంటుందని యజమాని తెలిపారు. గ్రామంలో పిడుగు పడటంతో చాలా గృహాలలో ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయని గ్రామస్తులు తెలిపారు.



Post Comment