కిల్కారి కాల్ సేవలు -చిన్నారి చిరునవ్వులు
రాజధాని వాయిస్ :దుర్గి.అక్టోబర్ 21
దుర్గి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు మంగళవారం కిల్కారి ప్రోగ్రాం పైన ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. కిల్కారి ప్రోగ్రాం ఆఫీసర్ రాజు కిల్కారి కాల్ సర్వీస్ పైన ఆశా, ఏ. యన్. యం, పి. హెచ్. సి స్టాఫ్ కి అవగాహన కార్యక్రమం నిర్వహించారుకేంద్ర ప్రభుత్వం కిల్కారి ప్రోగ్రాంను గర్భిణీ, బాలిoతల కొరకు ప్రవేశ పెట్టటం జరిగింది. ఈ కిల్కారి కాల్ ద్వారా తల్లీ మరియు బిడ్డల యొక్క ఆరోగ్య సమాచారం అందిచబడుతుంది. ఈ కిల్కారి కాల్స్ గర్భిణీ నాల్గవ నెల మొదలుకొని పుట్టిన బిడ్డ సంవత్సరం వరకు వస్తాయి. ఈ కిల్కారి వాయిస్ కాల్స్ వారానికి ఒకసారి గర్భిణీ, బాలిoతల యొక్క మొబైల్స్ కి కాల్స్ వస్తాయి . కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కిల్కారి కాల్ నెంబర్ 911600103660 , ఈ కాల్ నెంబర్ని గర్భిణీలు మరియు బాలింతలు వాళ్ళ మొబైల్ లో సేవ్ చేసుకున్నట్ల అయితే కాల్ వచ్చినపుడు ఎత్తి పూర్తి సమాచారాన్ని వినగలుగుతారు. ఒక వేళ్ళ మరల తిరిగి ఆ సమాచారాన్ని వినాలి అంటే 14423 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి వినవచ్చు. ఈ కిల్కారి సేవలను గర్భిణీలు, బాలిoతలు ఉపయోగిoచుకోవాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఆశాఅధికారి. యన్.సురేష్, డా,దయానిధి, సి. హెచ్. ఓ.కల్పన,హెచ్ఈ. శ్రీనివాసరావు,సద్గురు,ఏ. యన్.యం.లు ఆశాలు,పాల్గొన్నారు.



Post Comment