దీపావళి వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ దంపతులు  

 

 

రాజధాని వాయిస్: వినుకొండ. 

 

పట్టణంలోని కొత్తపేటలో జీవీ నివాసంలో సోమవారం దీపావళి సంబరాలు నిర్వహించారు. సతీమణి లీలావతితో కలిసి జీవీ ఆంజనేయులు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇంట్లో పూజలు నిర్వహించిన అనంతరం ఇంటిముందు బాణాసంచా కాల్చి ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన సంక్షేమ బాలికల గురుకుల వసతి గృహంలో చీఫ్ విప్ జీవీ దంపతులు చిన్నారులతో కలిసి బాణాసంచాలు కాల్చి దీపావళి సంబరాల్లో పాల్గొని ఉత్సాహంగా గడిపారు. కార్యక్రమంలో జిడిసిసి చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares