దీపావళి పండుగ ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింపాలి

 

టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడెల శివరామ్

అక్టోబర్ 19
రాజధాని వాయిస్ :
సత్తెనపల్లి

దీపావ‌ళి పండుగ ప్ర‌జ‌లంద‌రి జీవితాల్లో వెలుగులు నింపాలని టిడిపి ప్రదాన కార్యదర్శి డాక్టర్ కోడెల శివరామ్ అన్నారు. ప్ర‌జ‌లకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు ఒక ప్ర‌క‌ట‌న ద్వారా దీపావ‌ళి పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు.
అమావాస్య‌నాటి కారు చీక‌టిని తొల‌గించడానికి, దీపాల‌తో వెలుగును నింపడం ఈ పండుగ‌ సంప్ర‌దాయ‌మ‌ని, మ‌న‌లోని అంథ‌కారాన్ని తొల‌గించి జ్ఞాన జ్యోతులు వెలిగించాల‌న్న‌ది దీనివెనుక ఉద్దేశ‌మ‌ని, ప్ర‌తిఒక్క‌రి జీవితాల్లో సుఖః సంతోషాలు వెళ్లివిరియాల‌ని,
ఆ లక్ష్మీదేవి చ‌ల్ల‌ని చూపుతో అష్ట ఐశ్వర్యాలు సిద్దించాల‌ని కోరారు. దీపావళి అనేది చీకటి పై వెలుగు, అజ్ఞానం పై జ్ఞానం, చెడు పై మంచి విజయం సాధించిన పండుగ. ఈ పవిత్ర పండుగ సందర్భంగా ప్రతి ఇంటా ఆనందం, ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని తెలిపారు.ప్రజలు దీపావళి పండుగను ఆనందంగా, పర్యావరణహితంగా జరుపుకోవాలని, ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Post Comment

You May Have Missed

0Shares