మహోన్నతమైనది ఉచిత వైద్య సేవ
ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి
రాజధాని వాయిస్ :మాచర్ల. అక్టోబర్ 19
ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం ఒక మహోన్నతమైన సేవ అని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక మానుకొండ కళ్యాణ మండపంలో లక్ష్మణ్ ఆర్థో కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని,క్యాంప్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల ఆరోగ్యం కోసం కూటమి ప్రభుత్వం వైద్యానికి పెద్ద పేట వేస్తుందన్నారు. మాచర్ల ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ అయితే అన్ని వర్గాల వారికి మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పాలడుగు లక్ష్మీనారాయణ, మాచర్ల మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ కొమెర దుర్గారావు, మాచర్ల మార్కెట్ యాడ్ చైర్మన్ రాజబోయిన మధు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు,టిడిపి రాష్ట్ర కార్యదర్శి పంగులూరి అంజయ్య, కజ్జం సైదయ్య, గుండాల శ్రీనివాసరావు, ఎస్టీ సెల్ అధ్యక్షులు వజ్రం నాయక్ తదితరులు పాల్గొన్నారు.



Post Comment