స్వచ్చ మైన గాలి మనందరి హక్కు

పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా

రాజధాని వాయిస్: పిడుగురాళ్ల.అక్టోబర్ 18

 

స్వర్ణ ఆంధ్ర-స్వచ్చ ఆంధ్ర స్వచ్ఛమైన గాలి మనందరి హక్కు అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించటం, వాతావరణ కాలుష్యం నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పాల్గొని జెండా ఊపి భారీ ర్యాలీని ప్రారంభిచారు. తదుపరి ర్యాలీగా వెళ్లి జానపాడు రోడ్ సర్కిల్ లో స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం మీద ప్రతిజ్ఞ చేసారు.ఈ కార్యక్రమంలో గురజాల రెవెన్యూ డివిజన్ అధికారి మురళి కృష్ణ, తహశీల్దార్ మధుబాబు, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, విధ్యుత్ శాఖ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది,మేప్మా సిబ్బంది, ఆశ వర్కులు, మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares