కర్నూలు ప్రధాని సభ విజయవంతం
- మంత్రులు, ఉన్నతాధికారులు,జిల్లా అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి
కర్నూలు నేనుసైతం:- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న కర్నూలు లో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ సమావేశం విజయవంతం చేసినందుకు మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులను అభినందించారు. శుక్రవారం సాయంకాలం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కార్యాలయం నుండి మంత్రులు, ఉన్నతాధికారులు, కర్నూలు – నంద్యాల జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని ఏపీలో నాలుగోసారి జరిపిన పర్యటనలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారని… వీటిల్లో కర్నూలులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని సీఎం అన్నారు. ఈ సభ మంచి మెసేజ్ ఇచ్చిందని సీఎం అన్నారు. అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేశారని ముఖ్యమంత్రి అన్నారు. ప్రధాని సైతం పర్యటనను ఎంతో ఆస్వాదించారని సీఎం తెలిపారు. శ్రీశైలం మల్లన్న ఆలయం దర్శనంపై ప్రధాని ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారని సీఎం వివరించారు. ప్రధాని మోదీ సైతం సూపర్ జీఎస్టీ కార్యక్రమాలను అభినందించారని సీఎం చెప్పారు. జీఎస్టీ నెల రోజుల పాటు చేసిన కార్యక్రమాలపై సమగ్రంగా ఒక పుస్తకాన్ని ప్రచురించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుండి జిల్లా కలెక్టర్ డా ఏ.సిరి, ఎస్పీ కార్యాలయం నుండి ఎస్పీ విక్రాంత్ పాటిల్,డి ఆర్ వో వెంకటనారాయణమ్మ , ఆర్డీవో సందీప్ కుమార్, కమర్షియల్ టాక్సెస్ అసిస్టెంట్ కమిషనర్ నీరజ ,డిటిసి శాంతకుమారి ,సి పి ఓ భారతి ,డిఎస్ఓ రాజా రఘువీర్ , ఏపీ ఎస్పీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషాద్రి ,ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, డి ఆర్ డి ఏ ,డి డబ్ల్యూ ఎం ఏ ఏ పి డి లు పాల్గొన్నారు.



Post Comment