అన్నీ మతాల ఆచారాలను గౌరవించాలి:సయ్యద్ నాగూర్ వలి
వైకాపా నాయకులు మండలిలో వ్యవహరించిన తీరు మహా అపచారం
నకరికల్లు మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు సయ్యద్ నాగూర్ వలి
రాజధాని వాయిస్:పిబ్రవరి 21,నకరికల్లు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు సయ్యద్ నాగుర్ వలి మీడియాతో మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్సీల మహా అపచారం ముస్లిం సమాజం తరపున తీవ్ర ఖండించారు.
శాసనమండలిలో నేడు వైకాపా ఎమ్మెల్సీలు ప్రవర్తించిన తీరు అత్యంత హేయమైనదని, ఇది కేవలం ఒక మతానికి జరిగిన అవమానం కాదు, భారత రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని, హిందూ సమాజం కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి చిత్రపటాలను పట్టుకుని, కాళ్ళకు చెప్పులు వేసుకుని ఊరేగింపు చేయడం వైకాపా నేతల అహంకారానికి పరాకాష్ట. నిరసన అనంతరం ఆ పవిత్ర చిత్రపటాలను అక్కడే వదిలేసి వెళ్ళడం వారి అపచారానికి నిదర్శనం.
నేడు హిందూ దైవాన్ని అవమానించిన వారు, రేపు అల్లాను లేదా ఏసుక్రీస్తును కూడా అపచారం చేస్తారు. అందుకే మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ ఈ దుశ్చర్యను నిరసించాలి.
కూటమి ప్రభుత్వం అర్చకులతో పాటు ఇమామ్లు, మౌజన్లు మరియు పాస్టర్లకు గౌరవ వేతనాలు పెంచి, సర్వమతాలను గౌరవిస్తోంది.
జగన్ పాలనలో 200 పైగా ఆలయాలపై దాడులు జరిగినా ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు. దేవాలయ భూములు, చర్చి భూములు మరియు వక్స్ భూములను జగన్ ముఠా యథేచ్ఛగా కబ్జా చేసింది. కుంభకోణాల మరుగున పడవేసే ప్రయత్నం: టీటీడీలో జరిగిన కల్తీ నెయ్యి మరియు పరకామణి కుంభకోణాల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికే ఎమ్మెల్సీలు సభను అడ్డుకుంటున్నారు.
“పరమత సహనమే మనందరి అసలైన ధర్మం – అదే మన బలం”. వైకాపా చేస్తున్న ఈ మహా అపచారాలను నిరసించి, అన్ని మతాలను, ధర్మాలను కాపాడుకోవాలని సయ్యద్ నాగుర్ వలి ప్రజలకు పిలుపునిచ్చారు.



Post Comment