నరసరావుపేటలో ప్రభ ఒరిగిందనేది అవాస్తవం…

క్లారిటీ ఇచ్చిన టూ టౌన్ సీఐ ప్రభాకర్

 

రాజధాని వాయిస్: ఫిబ్రవరి 17

నరసరావుపేట.

పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని కాకుమాను వీధి లో ప్రభ ఒరిగిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్త పూర్తిగా అవాస్తవం.ఈ ఘటనకు సంబంధించి ప్రచారంలో ఉన్న వీడియోలు మరియు చిత్రాలు ప్రస్తుత పరిస్థితులకు సంబంధించినవి కావని నరసరావుపేట టూ టౌన్ సిఐ ప్రభాకర్ స్పష్టం చేశారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం పాతదై ఉండి,గత సంవత్సరం కృష్ణా జిల్లాలోని యనమలకుదురులో జరిగిన ఘటనకు సంబంధించినవిగా గుర్తించబడింది. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా పాత వీడియోలను పంచుతూ ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి నిరాధార వార్తలను నమ్మకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక వర్గాల నుంచి విడుదలయ్యే సమాచారం మాత్రమే విశ్వసించాలని కోరుతున్నారు.సమాజంలో శాంతి భద్రతలు కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత కావున, నిర్ధారణ లేని సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని సూచించారు. వీడియోలు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడం చట్టరీత్యా నేరం. కావున మీడియా మిత్రులు ఈ విషయమును గమనించవలసినదిగా విజ్ఞప్తి చేశారు.

Post Comment

You May Have Missed

0Shares