తిరుమల లడ్డూ కల్తీపై వైసీపీ దొంగ ఏడుపు..

సిగ్గులేకుండా వైసీపీ నేతలు ఎదురాని దూషిస్తున్నారు…

 

లడ్డూ కల్తీ నిజం

అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డే కల్తీ జరిగిందని అంగీకారం…

 

హెరిటేజ్‌పై ఆరోపణలు – ఆధారాలు ఎక్కడ?

 

కల్తీతో సంబంధం లేని సంస్థను లాగి దృష్టి మళ్లింపు..

 

హిందూ సంప్రదాయాలపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు..

 

నిజం దాగదు, బాధ్యులపై చర్యలు తప్పవని మండ‌లిలో హెచ్చ‌రించిన మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

 

రాజధాని వాయిస్ :ఫిబ్రవరి 17

అమరావతి.

మంగ‌ళ‌వారం శాసనమండలిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ ఎమ్మెల్సీల‌పై, ఆ పార్టీ నేతలపై ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని అప్పటి టీటీడీ చైర్మన్ స్వయంగా ఒప్పుకున్నా వాస్తవాన్ని దాచిపెట్టి, సిగ్గుపడాల్సింది పోయి వైసీపీ నేతలు కూట‌మి ప్ర‌భుత్వంపై ఎదురు దాడులు చేయడం, సంబంధం లేని హెరిటేజ్ సంస్థ‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం దారుణమని ఆయన మండిపడ్డారు.

కల్తీ జరిగిందని ఒప్పుకున్న తర్వాత కూడా బాధ్యత నుంచి తప్పించుకోవడానికి కుట్ర రాజకీయాలు చేయడం వైసీపీ తీరుకు నిదర్శనమన్నారు. మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వయంగా లడ్డూ కల్తీ విషయాన్ని ఒప్పుకున్నారు

అనే నిజాన్ని ప్రజలు మరచిపోరన్నారు. అయినా నేడు

అదే వైసీపీ నేతలు దాన్ని మళ్లించేందుకు కొత్త ఆరోపణలు తీసుకురావడం,నిజాలను వక్రీకరించడం అత్యంత ఖండనీయం అని పేర్కొన్నారు. ఆధారాలు లేని ఆరోపణలతో ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయాలనుకోవడం రాజకీయ దిగజారుడుతనం అని విమర్శించారు. హెరిటేజ్ ఇష్యూపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ఒక్క ఆధారం అయినా చూపించగలరా? అని మంత్రి సూటిగా ప్రశ్నించారు. కల్తీతో ఎలాంటి సంబంధం లేని హెరిటేజ్ సంస్థ పేరును లాగడం ద్వారా అసలు అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలనే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే చట్టపరంగా, నైతికంగా సమాధానం చెప్పాల్సిందే అని హెచ్చరించారు.అదే విధంగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వడం లేదు? అని మంత్రి ప్రశ్నించారు. హిందూ సంప్రదాయాలపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని, ఎందుకంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసింది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు అని వ్యాఖ్యానించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు వంటి పవిత్ర సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు ఎప్పటికీ క్షమించరని మంత్రి హెచ్చరించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ఒప్పుకున్న వాస్తవం నుంచి తప్పించుకునే ప్రయత్నాలు ఎంత చేసినా నిజం దాగదని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Post Comment

You May Have Missed

0Shares