*ఆకాశంలో అద్భుతం.. ‘రింగ్ ఆఫ్ ఫైర్’ భారత్లో కనిపిస్తుందా?*
రాజధాని వాయిస్:పిబ్రవరి 16,
పిబ్రవరి 17వ తేదీన అరుదైన ‘రింగ్ ఆఫ్ ఫైర్’ (వలయాకార సూర్య గ్రహణం) ఏర్పడనుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పలేకపోవడంతో చుట్టూ బంగారు వలయంలా కనిపిస్తుంది. ఇది ప్రధానంగా అంటార్కిటికాలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. భారత్లో మాత్రం వీక్షించే అవకాశం లేదు.ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల్లో పాక్షికంగా కనిపిస్తుంది. ఈ అగ్నివలయం గరిష్టంగా 2 నిమిషాల 20 సెకన్ల పాటు కనువిందు చేయనుంది.17వ తేదీన ఉదయం 7.01 గంటలకు గ్రహణం ప్రారంభం అవుతుంది.
Post Comment