ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న కమ్యూనిటీ మేనేజ్డ్ నాచురల్ ఫార్మింగ్ (APCNF) విధానాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడానికి ఫ్రాన్స్‌కు చెందిన CIRAD పరిశోధక బృందం సోమవారం బెల్లంకొండ ఆర్ఎస్కేను సందర్శించింది.ఈ బృందంలో ప్రముఖ పరిశోధకులు డా. బ్రునో డోరిన్, డా. క్లేర్ లెపాల్ట్ ,APCNF మరియు నాన్-APCNF రైతుల వ్యవసాయ విధానాలు, ఆదాయం, కుటుంబ ఆరోగ్యం, జీవన ప్రమాణాలపై నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా ఈ ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయ రైతులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్న సమావేశంలో రైతులు తమ అనుభవాలను స్వేచ్ఛగా వెల్లడించారు.జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె. అమల కుమారి పల్నాడు జిల్లాలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ సాంకేతిక విధానాలు, వాటి ద్వారా రైతులకు కలిగిన ఆర్థిక, ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు.
Post Comment