కోటప్పకొండ భక్తుల వసతుల కోసం రూ.10 లక్షల విరాళం
మంత్రి గొట్టిపాటి సమక్షంలో కలెక్టర్‌కు
చెక్కు అందజేసిన క్వారి అసోసియేషన్
రాజధాని వాయిస్:
ఫిబ్రవరి 15నరసరావుపేట.
కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్లకు వచ్చే భక్తుల సౌకర్యార్థం సంతమాగులూరు మండలం గురిజెపల్లికి చెందిన శ్రీ త్రికోటేశ్వర గ్రానైట్ క్వారి అసోసియేషన్ రూ. 10 లక్షల భారీ విరాళాన్ని అందజేసింది. ఆదివారం నాడు అసోసియేషన్ ప్రతినిధులు ఈ మేరకు చెక్కును రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమక్షంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాకు అందజేశారు. దాతలను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు.ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ,భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ క్రమంలో క్వారి అసోసియేషన్ వారు సామాజిక బాధ్యతతో ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి దాతృత్వం ఇతరులకు స్ఫూర్తిదాయకమని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.



Post Comment