రబీ పంట నమోదుకు పిబ్రవరి 20 వరకు గడువు:

ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్టర్ లో పేర్లు నమోదు చేసుకోవాలి

పిబ్రవరి 20 వరకు రబీ పంట నమోదు

సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీ కృష్ణ దేవరాయలు

 

రాజధాని వాయిస్:పిబ్రవరి 13,పిడుగురాళ్ల.

 

 వ్యవసాయసంచాలకులు బత్తుల. శ్రీకృష్ణ దేవరాయలు మీడియాతో మాట్లాడుతూ పిడుగురాళ్ల సబ్‌డివిజన్ పరిధిలోని పిడుగురాళ్ల, మాచవరం, దాచేపల్లి,కారంపూడి, నకరికల్లు మండలాల రైతులందరు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలు సకాలంలో పొందుటకు ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవలెను.రైతులు తమకు సమీపంలోని గ్రామ వ్యవసాయ సహాయకులు విఏఏ, వీహెచ్ఏలను సంప్రదించి నమోదు ప్రక్రియను పూర్తిచేయవలసిందిగా కోరడమైనది.ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేయించుకొనిన రైతులకే క్రింది ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయని, యూరియా,ఇతర ఎరువుల పంపిణీపంటల బీమా,పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు, ఇతర ప్రభుత్వ వ్యవసాయ పథకాలు,ప్రస్తుత రబీ పంట సీజన్‌కు సంబంధించిన పంట నమోదు కూడా తప్పనిసరిగా చేయించుకోవలెను.ఫిబ్రవరి 20వ తేదీ నమోదు చివరితేదీగా నిర్ణయించబడినది.అందువలన రైతులు ఆలస్యం చేయకుండా వెంటనే నమోదు ప్రక్రియ పూర్తి చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు స్వయంగా కూడా పంట నమోదు చేసుకునే అవకాశం కల్పించినది.కావున అవసరమైన వివరాలతో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవచ్చని,రైతులందరూ ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందవలసిందిగా కోరడమైనది.

Post Comment

You May Have Missed

0Shares