వాలీబాల్ టోర్నమెంట్ కరపత్రాలు ఆవిష్కరణ..

 రాజధాని వాయిస్ :

ఫిబ్రవరి 09 భట్టిప్రోలు.

మండల కేంద్రమైన భట్టిప్రోలులోని తమ్మన మల్లికార్జునరావు ఉన్నత పాఠశాలలో ఈనెల 14,15 తేదీలలో స్వర్గీయ పులికొండ రాధాకృష్ణ గుప్తా,కొసన సుబ్బారావు ఎన్ డి ఎస్ మెమోరియల్ రాష్ట్రస్థాయి వాలీబాల్ ఇన్విటేషన్ పోటీలు జరుగుతాయని వాలీబాల్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు సోమవారం తెలిపారు.స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ,

 14వ తేదీ ఉదయం నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీలు ఫ్లడ్ లైట్స్ కాంతులతో పగలు, రాత్రి నిర్వహించబడతాయన్నారు.పోటీలకు ముఖ్య అతిథిగా జాతీయ అర్జున,ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఇండియన్ వాలీబాల్ కోచ్ అరికపూడి రమణారావు విచ్చేస్తున్నట్లు వారు తెలిపారు.పోటీలలో విజేతలైన వారికి మొదటి బహుమతి గా రూ 25000 లు,రెండవ బహుమతి రూ 20,000 లు,మూడవ బహుమతి రూ 15000లు,నాలుగవ బహుమతి రూ 10000 లు అందిస్తారని ఇవి కాక క్రీడా ప్రతిభ కనపరిచిన నలుగురికి నగదు బహుమతులు ఇవ్వటం జరుగుతుందని వారు తెలిపారు.ప్రారంభం రోజు కృష్ణ..గుంటూరు జిల్లాల మహిళా వాలీబాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఉదయం 9 గంటలకు నిర్వహిస్తారని వారు తెలిపారు.ఈ సమావేశంలో కమిటీ అధ్యక్షుడు పులికొండ మల్లికార్జునరావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు అల్లాబక్షు, కన్వీనర్ కరీంశెట్టి సుబ్బారావు, కార్యదర్శి వంగర శేషగిరిరావు,షేక్ కరీముల్లా,గార్యాల వెంకటేశ్వరరావు,గల్లా వెంకట శివ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares