అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం..

కటికల బాలకృష్ణ

 

రాజధాని వాయిస్: ఫిబ్రవరి 09

కారంపూడి.

 

కూటమి ప్రభుత్వ హయాంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు కటికల బాలకృష్ణ వెల్లడించారు. మండల కేంద్రంలోని కాపుల బజారులో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు కింద రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్వహించబోయే సీసీ రోడ్లకు వారు భూమి పూజ చేసి, శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ , కారంపూడి మండలం ప్రజలు గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధిని చూస్తున్నారని, అన్ని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఎమ్మెల్యే జూలకంటిలు కట్టుబడి ఉన్నారని వివరించారు. 

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బొమ్మిన శేషగిరి , తండా మస్తాన్ జానీ, పలిశెట్టి కొండ, పలిశెట్టి శ్రీను కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares