ఆత్మ విశ్వాసం ముందు అడ్డురాని వైకల్యం..

సంకల్ప యాత్ర విజయ తీరాన చేరిన రోజు

రాజధాని వాయిస్:
పిబ్రవరి 09
రాజుపాలెం.

సిఎం చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ కేసులో నాడు అక్రమంగా అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజులు ఉంచారు.ప్రస్తుత సత్తెనపల్లి ఎమ్మెల్యే,మాజీ మంత్రి కన్నాలక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నాడు సత్తెనపల్లి టిడిపి కార్యాలయంలో సిబిఎన్ కు మద్దతుగా విజయవంతంగా దీక్ష పూని,టిడిపి కార్యకర్తగా,ఒక అభిమానిగా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని, కడిగిన ముత్యం లాగా కేసు నుండి బయటికి రావాలని, 2024లో సిఎం అవ్వాలని నల్లగొర్ల నరసింహ రావు కోరుకున్నారు .
ఆ కల నెరవేరినందుకు సిని నటుడు బండ్ల గణేష్ తో కలిసి నరసింహరావు శారీరక అంగవైకల్యంను లెక్క చేయకుండా,
అభిమాన నాయకుడుపై ఉన్న అంతులేని సంతోషం,ఆత్మ విశ్వాసంతో సిఎం పై ఉన్న అభిమానంతో పల్నాడు జిల్లా,రాజుపాలెం మండలం,పెద నెమలిపూరి నుండి షాద్ నగర్ కు వెళ్లి,అక్కడ నుండి తిరుమలకు 22 రోజులు బండ్ల గణేష్ తో కలసి సంకల్పయాత్ర విజయవంతంగా పూర్తి చేసి శ్రీవారిని దర్శించుకోని చంద్రబాబు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిస్తూ, స్వర్ణాంద్ర ప్రదేశ్ రధ సారధి కొనసాగాలని దేవ దేవున్ని కోరుకున్నారు.

Post Comment

You May Have Missed

0Shares