పీఆర్సీ కమిషన్ నియామకంపై..
ఎమ్మెల్యే యరపతినేనిని కలసిన యూటీఎఫ్ నాయకులు…
రాజధాని వాయిస్:పిబ్రవరి 8 పిడుగురాళ్ల.
పీఆర్సీ కమిషన్ నియమించాలని, ఐఆర్ 29 శాతం ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డిఏ లు చెల్లించాలని, ఆర్థిక బకాయిలు చెల్లించాలని, వచ్చే శాసనసభ సమావేశాల్లో ఉద్యోగులు తరఫున ప్రశ్నించాలని పల్నాడు జిల్లా గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావుకు పిడుగురాళ్ళ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు వినతిపత్రం అందజేశారు.ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ఉపాధ్యాయులు, ఉద్యోగస్తుల సమస్యల పట్ల వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడతానని , సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు షేక్ ఖాసీం పీరా, జిల్లా కార్యదర్శి డి.శ్రీనివాసరావు, సౌహార్ద ప్రతినిధిజమాల్, పిడుగురాళ్ల ప్రాంతీయ శాఖల మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ఎం దాసు, కెవిఎస్ ఎన్ ప్రసాద్, యూటీఎఫ్ నాయకులు, కార్యకర్తలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



Post Comment