హిందూ సంస్కృతికి నిలయాలు గ్రామోత్సవాలు..
ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి
రాజధాని వాయిస్:ఫిబ్రవరి 07
రెంటచింతల.
హిందూ సంస్కృతికి నిలయాలు మన గ్రామోత్సవాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మిట్టగుడిపాడులో శ్రీ గంగా భ్రమరాంబ సమేత నాగేశ్వరస్వామి, శ్రీ రుక్మీణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వార్ల కళ్యాణ మహోత్సవం సందర్భంగా శుక్రవారం పొద్దుపోయే వరకు నిర్వహించిన తిరుణాళ్ల వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, కూటమి పార్టీల నాయకులు ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో కొలువుదీరిన స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గ్రామంలో వివిధ రకాల విద్యుత్ దీపాలతో అలంకరించిన ప్రభలను ఆయన సందర్శించి, ప్రసంగించారు. ప్రజలందరూ ఐక్యతగా కులాలకు, మతాలకు అతీతంగా నిర్వహించే గ్రామోత్సవాల్లో స్నేహభావ వాతావరణం నెలకొంటుందన్నారు.ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే వెంట కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Post Comment