కనుల పండగ వీరబ్రహ్మేంద్ర స్వామి తిరుణాల మహోత్సవం…

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే జూలకంటి

 

రాజధాని వాయిస్: ఫిబ్రవరి 07

కారంపూడి.

 

మండల పరిధిలోని ఒప్పిచర్ల గ్రామంలో వేంచేసియున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వార్షిక తిరనాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం వేడుకలు కన్నులు పండువగా జరిగాయి. ఈ ఉత్సవాలకు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటిని గ్రామ పెద్దలు ఘనంగా స్వాగతం పలికారు. ఉత్సవాలలో భాగంగా సాంప్రదాయబద్దంగా నిర్వహించిన గ్రామోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 

మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణలు నడుమ పురవీధుల్లో గ్రామోత్సవం సాగింది. అనంతరం ఆలయంలో కొలువు తిరిగిన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా నిర్వహించే తిరునాళ్ల మహోత్సవంలో అందరూ పాల్గొని, వేడుకగా నిర్వహించడం ఆనందదాయకంగా ఉందని ఎమ్మెల్యే జూలకంటి అన్నారు. 

ఆ వీరబ్రహ్మేంద్రస్వామి వారి కృపతో నియోజకవర్గం పాడి, పంటలతో ప్రాంతాల అభివృద్ధితో, సంక్షేమ దిశగా పయనించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares