అంగరంగ వైభవంగా శ్రీ మద్విరాట్ పోతులూరి
వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణం
రాజధాని వాయిస్: ఫిబ్రవరి 07
కారంపూడి.
అంగరంగ వైభవంగా
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణ మహోత్సవం వేడుకలను శుక్రవారం కారంపూడి మండలం,ఒప్పిచర్ల గ్రామంలోని మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పీఠాధిపతి మండోజి వీరబ్రహ్మచారి ఆధ్వర్యంలో వైభవంగా కళ్యాణం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ, ఒప్పిచర్ల లోని గోవిందాంబదేవి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో శుక్రవారం,శనివారం రెండు రోజులపాటు తిరునాళ్ల మహోత్సవం వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్వస్తిశ్రీ చాంద్రమానేన,
శ్రీ విశ్వాసు నామ సంవత్సర బహుళ పంచమి రోజున శ్రీగోవిందంబదేవి, శ్రీమద్విరాట్ వీర బ్రహ్మేంద్రస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించి, సాయంత్రం విగ్రహాలను ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని అన్నారు.శనివారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించి, విగ్రహ ఊరేగింపు జరుగుతుందన్నారు.అనంతరం భారీ మహా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.అనంతరం సాయంత్రం విద్యుత్ ప్రభలతో పాటు నృత్య కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
<script type=”text/javascript”> var infolinks_pid = 3443382; var infolinks_wsid = 0; </script> <script type=”text/javascript” src=”//resources.infolinks.com/js/infolinks_main.js”></script>



Post Comment