శ్రీవారి లడ్డును అపవిత్రం చేసిన దోషులను దేవుడే శిక్షించాలి..
తూనుగుంట్ల సాయిబాబా…
రాజధాని వాయిస్ :జనవరి 30
భట్టిప్రోలు.
శ్రీవారి లడ్డును అపవిత్రం చేసిన దోషులను దేవుడే శిక్షిస్తాడని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసిపి ప్రభుత్వం లో లడ్డును అపవిత్రం చేసినట్లు రుజువైన నేపథ్యంలో స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని
శుక్రవారం శుద్ధి చేశారు.
ఈ సందర్భంగా మహిళలు పురుషులు భక్తులు తరలివచ్చి అమ్మవారి చెట్టు వద్ద నుండి శోభాయాత్రగా వాసవి మాత దేవాలయానికి గోవింద నామాలు చేస్తూ తరలివచ్చారు. దేవాలయం గాలిగోపురం మెట్లను పసుపు నీటితో శుద్ధి చేశారు.స్వామివారి ఆలయాన్ని శుద్ధిచేసి పూజలు నిర్వహించారు. అనంతరం సాయిబాబా మాట్లాడుతూ, లడ్డు
తయారీలో ఉపయోగించిన నెయ్యిలో భారీ స్థాయిలో కల్తీ జరిగినట్లు దర్యాప్తు నివేదికలు వెల్లడించడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు.
2019 నుంచి 2024 మధ్యకాలంలో రసాయనాలతో తయారుచేసిన కల్తీ నెయ్యి సరఫరా చేసి ప్రసాదాల తయారీలో వినియోగించినట్లు విచారణలో నిర్ధారణ అయినట్లు సమాచారం వస్తోందని సాయిబాబా పేర్కొన్నారు.మొత్తం సుమారు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేయబడినట్లు,దాంతో
రూ 234 కోట్లకు పైగా ఆర్థిక నష్టం జరిగినట్లు లెక్కలు చూపుతున్నాయన్నారు.
ఈ నెయ్యి తయారీలో పాలు, వెన్న బదులు రసాయన పదార్థాలు మరియు వృక్ష ఆధారిత కొవ్వు పదార్థాలు ఉపయోగించినట్లు అధికారులు.గుర్తించడం జరిగిందన్నారు.
తిరుమల వంటి మహా పవిత్రక్షేత్రంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం అత్యంత దురదృష్టకరమన్నారు.
ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి పారదర్శక దర్యాప్తు జరిపి,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వాల మొదటి బాధ్యత అని దేవాలయాల పవిత్రతను దెబ్బతీసే చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం సహించబోదని సాయిబాబా ఆశాభావం వ్యక్తం చేశారు. కోట్లాదిమంది భక్తుల భావాలను గౌరవిస్తూ ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సాయిబాబా కోరారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం మండల ధర్మచారి బోర్లే అరుణకుమారి, మాటూరు గృహలక్ష్మి, కోట సంధ్యారాణి, ఆత్మూరి భవాని, సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా దేవాలయ ప్రముఖ పొన్నపల్లి సత్యనారాయణ, వేల్పూరీ శ్రీనివాసరావు,యడ్ల జయసీలరావు,డొక్కు శ్రీనివాసరావు,కంభం సుధీర్,లంక మురళి,ఆదిన బసవ పున్నయ్య,అన్వర్ అలీ,యార్లగడ్డ పాండురంగారావు, పున్నారావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



Post Comment