రాజధాని వాయిస్ క్యాలెండర్ ఆవిష్కరించిన….
శ్రీకర్ బయోటెక్ చైర్మన్ మరియుమేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లింగా శ్రీనివాసరావు..
మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి ఉషారాణి….
రాజధాని వాయిస్: హైదరాబాద్.
శ్రీకర్ బయోటెక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లింగా శ్రీనివాసరావు, డాక్టర్ పి ఉషారాణి 2026 రాజధాని వాయిస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ లింగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్నది ఉన్నట్లు సమాచారాన్ని చేరవేసేలా రాజధాని వాయిస్ ఉండాలని ఆకాంక్షించారు.రాజధాని వాయిస్ దీనిని అభివృద్ధి చెందుతూ రానున్న రోజుల్లో ఉన్నత శిఖరాల అధిరోహించాలన్నారు.మేనేజింగ్ డైరెక్టర్ పి ఉషారాణి మాట్లాడుతూ, రాజధాని వాయిస్ తెలుగు దినపత్రిక దినదినాభివృద్ధి చెందుతూ, ప్రజల సమస్యలను అధికారులు దృష్టికి చేరవేసే విధంగా ఉండాలని పేర్కొన్నారు. అనంతరం రాజధాని వాయిస్ బృందం ద్వారా వారికి చిరు సత్కారం చేశారు.



Post Comment