అన్న ఎన్టీఆర్ వర్ధంతి….

 బంగారు బాటలు అనుసరణీయం..

 

రాజధాని వాయిస్ :జనవరి 18 నరసరావుపేట.

 సినీ, రాజకీయ రంగాల్లో ధృవతారలా వెలిగిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వర్ధంతి సందర్భంగా నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఘన నివాళులు అర్పించారు. సినీ రంగంలో నటనతో పాటు అన్ని విభాగాల్లో చెరగని మార్క్‌తో, రాజకీయాల్లో సంక్షేమ-అభివృద్ధి పథకాలతో కొత్త ఒరవడి తీసుకొచ్చిన ధీరోదాత్తుడు అన్న ఎన్టీఆర్ అని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన మహనీయుడు ఎప్పటికీ ఆదర్శంమని.సామాన్యుడికి రాజకీయ సమానత్వం కల్పించిన వారి బంగారు బాటలు అన్ని తరాలకు అనుసరణీయం అన్నారు. వారి జ్ఞాపకాలు ప్రతీ తెలుగు గుండెల్లో అజరామరం అని. అన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ మహోత్సవ రోజున వారిని స్మరించుకుంటూ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

Post Comment

You May Have Missed

0Shares