కారంపూడి యువకునికి వైబ్రంట్ ఇండియా సంస్థ వారిచే గౌరవ పురస్కారం..

ఈ నెల 24న గోవాలో గోవా సిఎం చేతుల మీదగా అవార్డు అందుకోనున్న బాలాజి నాయక్….

బాలాజి నాయక్ ను అభినందిస్తున్న పల్నాడు ప్రజలు

 రాజధాని వాయిస్..కారంపూడి..జనవరి15.

పల్నాడు జిల్లాలో ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూ క్రీడా రంగంలో, విద్య రంగంలో విద్యార్థులను, క్రీడాకారులను ప్రోత్సాహిస్తూ వారికీ అండగా ఉండటమే కాకుండా తనదైన రీతిలో వారికీ శిక్షణ ఇస్తూ సక్సెస్ కు చిరునామా గా నిలుస్తున్న వ్యక్తి కారంపూడి తండా కు చెందిన డాక్టర్ రామావత్. బాలాజీ నాయక్ శిరిగిరిపాడు లో జిల్లా పరిషత్ హైస్కూల్ లో పనిచేస్తున్న బాలాజీ నాయక్ అన్ని రంగాలలో విజయాలు సాధిస్తూ పతకాల పంటకు చేరువ అవుతున్నారు. మొదటినుంచి బాలాజీ నాయక్ కు క్రీడలు అంటే ఎంతో మక్కువ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో క్రీడాకారులను ప్రోత్సాహిస్తూ వారికీ శిక్షణ ఇస్తూ పల్నాడు ప్రాంతంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు. ఈయన సేవలను గుర్తించిన వైబ్రంట్ ఇండియా సంస్థ వారు బాలాజీ నాయక్ కు గౌరవ పురస్కారం అందించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీ గోవా లో జరిగే సదస్సులో బాలాజీ నాయక్ కు గోవా సిఎం చేతుల మీదగా బెస్ట్ ఎక్సలెన్స్ ఐకానిక్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ అవార్డును బాలాజీ నాయక్ అందుకోనున్నారు. అంతేకాకుండా గతంలో బెంగుళూరులో జరిగిన ఫైధియన్ జాతీయ క్రీడాలలో మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. పిన్న వయస్సులోనే ఈయనకు ఆత్మ రక్షణ స్పోర్ట్స్ లో డాక్టరేట్ రావడం విశేషం విద్యార్థులు క్రీడాకారులు వారి యొక్క లక్ష్యన్ని కోల్పోకూడదు అనేదే బాలాజీ నాయక్ ఆశయంగా చెప్పుకోవచ్చు. పల్నాడు ప్రాంతానికి చెందిన బాలాజీ నాయక్ అనేక రంగాలలో అవార్డులు సాధించి గౌరవపురస్కారం అందుకుంటున్న సందర్బంగా పలువురు బాలాజి నాయక్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Post Comment

You May Have Missed

0Shares