హరిజనుల పిర్యాదుతో భూ కబ్జాలపై విచారణ జరిపిన తహశీల్దార్

ఒప్పిచర్ల హరిజన కాలనీవాసుల వినతి – తాసిల్దార్ ఆదేశాలతో భూ కబ్జాలపై విచారణ

రాజధాని వాయిస్:కారంపూడి.

పల్నాడు జిల్లా, కారంపూడి మండలం, ఒప్పిచర్ల గ్రామంలోని హరిజన కాలనీవాసులు, తమ కాలనీ సమీపంలో చర్చి ఎదురుగా ఉన్న భూమిని కొంతమంది అక్రమంగా కబ్జా చేస్తున్నారంటూ తాహాసిల్దార్ వెంకటేశ్వర్ల నాయక్‌కు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన తాసిల్దార్ వెంకటేశ్వర్ల నాయక్, విచారణ జరపాలని వీఆర్వో ప్రభాకర్‌కు ఆదేశాలు జారీ చేశారు.ఎంఆర్ఓ ఆదేశాల మేరకు వీఆర్వో ఒప్పిచర్ల గ్రామంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా భూమిని కబ్జా చేసిన వారిని పత్రాలు చూపాలని అడగగా, తమ వద్ద ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేవని స్పష్టం చేసినట్లు తెలిపారు. హరిజన కాలనీవాసులు మాట్లాడుతూ, సర్వే నెంబర్లు 708/1, 711 పరిధిలోని సుమారు 170 సెంట్ల భూమిని 2002లో 35 ప్లాట్లుగా కేటాయించారని తెలిపారు. ఈ భూమి చర్చికి, పిల్లలు ఆడుకునేందుకు లేదా పాఠశాల నిర్మాణానికి ఉద్దేశించిన స్థలమని పేర్కొన్నారు. అక్రమ కబ్జాల వల్ల తమ హక్కులు హరించబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాసిల్దార్ తమపై దయచూపి న్యాయం చేయాలని హరిజన కాలనీవాసులు కోరారు. భూ వివాదంపై అధికారులు తీసుకునే నిర్ణయ పై కాలనీవాసులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Post Comment

You May Have Missed

0Shares