గురజాల నియోజకవర్గంలో ఇంటింటికి శ్రీ శ్రీనివాస కల్యాణ తలంబ్రాలు

ఎంతో వైభవoగా జరిగిన శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం

రాజధాని వాయిస్:డిశంబర్ 26,పిడుగురాళ్ల.

గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ప్రతి గడపకు స్వామివారి కల్యాణ తలంబ్రాలను, పూజ పసుపు కుంకుమ, అన్నమయ్య లడ్డు చేర్చే కార్యక్రమంలో భాగంగా
పిడుగురాళ్ల పట్టణ ఆర్యవైశ్య నాయకులు కనిగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు నుండి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి కల్యాణమండపం నందు పట్టణ మహిళా సత్సంగం బృందముల సుమారు 300 మంది సభ్యులచే చేపట్టడం జరిగినది.శాసనసభ్యుల ఆదేశాల మేరకు 80 వేల అన్నమయ్య లడ్లు , 80 వేల పసుపు కుంకుమ తలంబ్రాల ప్యాకెట్లు నియోజవర్గం మొత్తంనకు ప్రతి గడపకు చేర్చే బృహత్ కార్యక్రమములో భాగముగా పిడుగురాళ్ల పట్టణ ఆర్యవైశ్య నాయకులు కనిగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిద్ధమవుచున్నవి.

Post Comment

You May Have Missed

0Shares