భారతీయులు జీరో అందించక పోతే ప్రపంచం అభివృద్ది చెందేది కాదు:రామకృష్ణ మాష్టార్
భారతీయులు గణితానికి అందించిన సేవలు శూన్యము: రామకృష్ణ మాస్టర్
రాజధాని వాయిస్:డిశంబర్ 22,పిడుగురాళ్ళ.
పిడుగురాళ్ల పట్టణంలోని జూనియర్ కాలేజీ ఎదురుగా గల వివేకానంద పాఠశాలలో నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిజజీవితంలో గణితం యొక్క ఆవశ్యకత ను 9వ తరగతి విద్యార్ధి రాజరాజేశ్వరి చాలా చక్కగా వివరించింది. ఎనిమిదో తరగతి నుంచి హరిణి గణితం మీద చక్కని పద్యాన్ని వివరించి అందరి మన్ననలు పొందారు.ఆ పద్యం ఏమిటంటే గణితమును ప్రేమించుమన్నా,తర్కమును పెంచమన్నా, గణితమంటే సమస్య కాదోయ్,గణితం అంటే సాధనోయ్. డైరెక్టర్ రామకృష్ణ మాస్టర్ ఆద్వర్యంలో ఉపాధ్యాయులు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.ఈ సందర్బంగా రామకృష్ణ మాస్టర్ మాట్లాడుతూ భారతీయులు గణితానికి అందించిన సేవలు శూన్యము అను విషయమును కూలంకషంగా వివరించారు. భారతీయులు జీరో ని అందించకపోతే ప్రపంచం ఇంత డెవలప్ అయ్యేది కాదని, జీరో ద్వారానే సంఖ్యలు అనంతం ఏర్పడినవి. శ్రీనివాస రామానుజన్ యొక్క జన్మదినమును నేషనల్ మ్యాథమెటిక్స్ డే గా ఎందుకు జరుపుకుంటాము అనే విషయాన్ని విద్యార్థులకు చక్కగా వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Post Comment