రెండు పోలీయో చుక్కలు పిల్లల జీవితాలకు వెలుగు

పోలీయో చుక్కలను పిల్లలకు వేయించాలి,

రాజధాని వాయిస్ డిసెంబర్ 21 అమృతలూరు,

 

ఐదుఏళ్ళ లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించాలని అమృతలూరు ప్రాజెక్ట్ ఐసిడిఎస్ అధికారిని ఏ లక్ష్మీదేవి అన్నారు. ఆదివారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో సిడిపిఓ లక్ష్మీదేవి పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు అందించారు.అనంతరం లక్ష్మీదేవి మాట్లాడుతూ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలను తప్పనిసరిగా వేయించాలన్నారు. సిబ్బంది సోమవారం మంగళవారం వైద్య సిబ్బందికి కేటాయించిన ప్రాంతాలలో ఇంటింటికి తిరిగి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారన్నారు. కార్యక్రమం లో సూపర్వైజర్ విజయలక్ష్మి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares