వరికూటి అశోక్ బాబు ఆద్వర్యంలో మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు

ఘనంగా జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ,

అన్ని గ్రామాలలో ఒకేసారి రచ్చబండ కార్యక్రమం,

రాజధాని వాయిస్ డిసెంబర్ 21 వేమూరు,
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేమూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఒకే సారి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు, తొలుత డా బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా వేమూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు పాల్గొన్నారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని జగనన్న పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ గ్రామాలలో ఎంతో కాలంగా పరిష్కారించబడని
పలు గ్రామ సమస్యల గురించి రచ్చబండ కార్యక్రమంలో ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
రానున్న రోజుల్లో జగన్నన్నను గెలిపించుకుని మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుందామని అశోక్ బాబు తెలిపారు అనంతరం గ్రామస్తులతో కలిసి కేక్ కట్ చేసి జగనన్నకు శుభాకాంక్షలు తెలిపారు.

Post Comment

You May Have Missed

0Shares