రియల్ గబ్బర్ సింగ్ ఇచ్చిన కోచింగ్ తో 12 మంది కానిస్టేబుల్స్ గా ఎంపిక

సిఐ వెంకట రమణ( రియల్ గబ్బర్ సింగ్) ఇచ్చిన కోచింగ్ తో 12 మంది కానిస్టేబుల్స్ గా ఎంపిక

ముగ్గురు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక

రాజధాని వాయిస్:డిశంబర్ 18,మాచర్ల.

తురక కాంతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా మాచర్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ (అలియాస్ గబ్బర్) 100 మంది పైగా నిరుపేద విద్యార్థులకు నెల్లూరులో ఉచిత కోచింగ్ ఇవ్వడం జరిగింది.ఆ కోచింగ్ తీసుకున్న వారిలో  12 మంది కానిస్టేబుల్ గా ఎంపిక అయ్యారు. వీరిలో 5 గురు మహిళాలు ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వీరు నియామక పత్రాలు అందుకున్నారు.అంతేకాకుండా సీఆర్పీఎఫ్,సిఐఎస్ఎఫ్ రైల్వే డిపార్ట్మెంట్లో గ్రూప్.డి ఉద్యోగుల ఎంపిక అవ్వడం జరిగింది.సిఐ ఉచిత కోచింగ్ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్లు గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రస్తుతం పల్నాడు జిల్లా మాచర్ల టౌన్ సిఐ గా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ ( అలియాస్ గబ్బర్ సింగ్) సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సీఐ వెంకటరమణ మాట్లాడుతూ కటిక పేదరికం అనుభవించి పేదరికంలో కూడా ఎస్సై ఉద్యోగం సాధించి నా మాదిరిగా పేదరికంలో ఉన్న పేద విద్యార్థులకు నా వంతు ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి కొంతమందికి ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేశానని, ఇందులో భాగంగా ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ ఒంకి పెంచలయ్య తనవంతు సహకారంగా నెల్లూరులో ఉన్న తన ఇంజనీరింగ్ కాలేజీని ఉచితంగా నా మీద నమ్మకంతో నాకు అప్ప చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు.అంతేకాకుండా నాపై అధికారులు,నాతోటి సహచరులు, మిత్రులు శ్రేయోభిలాషులు అన్ని శాఖ అధికారులు తమ వంతు సహకారాలు అందించారని వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

Post Comment

You May Have Missed

0Shares