అభివృద్దికి చిరునామాగా మారిన గుంటూరు తూర్పు నియోజకవర్గం

అభివృద్ధికి చిరునామా గుంటూరు ఈస్ట్

ప్రతి ప్రాంతంలో వేగవంతంగా అభివృద్ధి పనులు

గత ప్రభుత్వంలో యూజీడీ పనులపై తీవ్ర నిర్లక్ష్యం

వందల కోట్లతో మళ్లీ పనులు ప్రారంభించాం

1.46 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు నసీర్

 

రాజధాని వాయిస్:డిశంబర్ 18,గుంటూరు.

నగరంలో గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) పనులను వేగవంతం చేపడుతున్నామని, గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. గురువారం స్థానిక గుంటూరు నగరంలోని ఆలీ నగర్, మారుతీనగర్, రామిరెడ్డితోట ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, పైపులైన్ల నిర్మాణానికి రూ.1.46 కోట్లతో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే నసీర్ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ గత ఐదేళ్ల కాలంలో గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. అభివృద్ధి ఆనవాళ్లు లేకుండా ధ్వంసం చేశారన్నారు. యూజీడీ పనులను పక్కన పడేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కనీసం పాదచారులు కూడా తిరిగే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ప్రాంతాన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో గుంటూరు నగర అభివృద్ధిపై ప్రధానంగా ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. 20 ఏళ్లుగా మొండిగేటు విస్తరణ లేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ క్రమంలో రైల్వే అధికారులతో చర్చించి రూ.8 కోట్ల నిధులు విడుదల చేయించామని తెలిపారు. త్వరలో పనులు ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. పాత గుంటూరు ప్రాంతాన్ని అభివృద్ధిలో కొత్త రూపు తీసుకొస్తున్నామని తెలిపారు. వీటితోపాటు ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా నియోజకవర్గంలో యువతను చైతన్యం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఏపీ మైనారిటీస్ కమిషన్ డైరెక్టర్ పఠాన్ జమీర్, డిప్యూటీ మేయర్ షైక్ షాజీలా, కార్పొరేటర్లు మీరవలి, అశోక్, డివిజన్ అధ్యక్షులు రియాజ్, రబ్బానీ, చిలక వెంకటేశ్వర్లు, సలాం, బట్ట రాజా, మాదాసు శేఖర్, సయ్యద్ అన్వర్, పిచ్చిరెడ్డి, సత్యం,హేమంత్, పాశం ఉమా, హుస్సేన్, అల్లం బాజీ,సతీష్, జానీ,కొత్తూరి వెంకట్, కూరకుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

Post Comment

You May Have Missed

0Shares