దుర్గి మండలంలో జిల్లా సైన్స్ ఫేర్ కు 5 ప్రాజెక్టులు ఎంపిక
దుర్గి మండలంలో జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ కు 5 ప్రాజెక్టులు ఎంపిక
రాజధాని వాయిస్:డిశంబర్ 18,దుర్గి.
దుర్గి మండల కేంద్రంలో మండల స్థాయి సైన్స్ ఫేర్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా మండల విద్యా శాఖాధికారి-1 ఖాసీం, మండల విద్యా శాఖాధికారి – 2 బెంజిమెన్, జడ్పీ హైస్కూల్ ప్రదానోపాధ్యాయుడు హనుమంతు రావు హజరై సైన్స్ ఫేర్ ప్రారంభించారు.మొత్తం 36 ప్రాజెక్టులు రావడం జరిగిందని, జిల్లా స్థాయికి మొత్తం ఐదు ప్రాజెక్టులు సెలెక్ట్ కాబడినాయని, వ్యక్తి గత కేటగిరి నందు ఏపీ మోడల్ స్కూల్ దుర్గి,ఎస్ కె ఎస్ జడ్పీహెచ్ఎస్ ఓబులేసుపల్లి విద్యార్థుల ప్రాజెక్టులు.గ్రూపు కేటగిరి నందు అడిగొప్పల జిల్లా పరిషత్తు హైస్కూల్,దుర్గి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రాజెక్టులు. ఉపాధ్యాయుల కేటగిరీ నందు జడ్పీహెచ్ఎస్ ముటుకూరు టీచర్ ప్రాజెక్ట్ సెలెక్ట్ కాబడినవని విద్యాధికారులు తెలియజేశారు.



Post Comment