దుర్గి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన గురజాల డీఎస్పీ జగదీష్
దుర్గి పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీచేసిన డీఎస్పీ జగదీష్
రాజధాని వాయిస్:డిశంబర్ 18,దుర్గి.
పల్నాడు జిల్లా దుర్గి పోలీస్ స్టేషన్ ను గురజాల డిఎస్పి జగదీష్ గురువారం వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి ఎస్సై సుధీర్ కుమార్ కు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు పెండింగ్లో ఉన్న కేసులను గుర్తించి సంబంధిత కేసుల వివరాలను ఎస్సైని అడిగి తెలుసుకున్నారు సమంత కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు అంతకుముందు స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బందికి సూచించారు మండలంలో పలు యాక్సిడెంట్లలో ధ్వంసమైన వాహనాలను పరిశీలించి వాటి వివరాలను సేకరించారు అనంతరం సిబ్బంది ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో కారంపొడి సిఐ టీవీ శ్రీనివాసరావు ఎస్సై సుధీర్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Comment