దివ్యాంగుల హక్కులకు విఘాతం కలుగరాదు

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు

 

     రాజధాని వాయిస్: సత్తెనపల్లి. 

సత్తెనపల్లి మండల న్యాయసేవాధికార కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ గారి ఆదేశాల మేరకు, సత్తెనపల్లి మండల న్యాయసేవాధికార కమిటీ చైర్మన్ మరియు సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి. విజయ్ కుమార్ రెడ్డి సూచనల మేరకు నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా న్యాయ అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్ షేక్ సుభాని మాట్లాడుతూ
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని సమాజంలోని ప్రతి స్థాయిలో మరియు అభివృద్ధిలో వికలాంగుల హక్కులు మరియు శ్రేయస్సును ప్రోత్సహించడం అలాగే , సామాజిక, ఆర్థిక సాంస్కృతిక మరియు వ్యక్తిత్వ వికాస పరంగా జీవితంలోని అన్ని అంశాలలో వికలాంగుల పరిస్థితిపై అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాది మధుసూధనరావు మరియు భవిత సెంటర్ అధ్యాపకులు విజయకుమారి, విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares