వైజేఏ ఆద్వర్యంలో కార్తీక మాస వన సమారాధన మహోత్సవ కార్యక్రమం

  యూట్యూబ్ జర్నలిస్ట్ ల ఆద్వర్యంలో కార్తీక మాస వన సమారాధన మహోత్సవ కార్యక్రమ

రాజధాని వాయిస్:నవంబర్ 15,నరసరావుపేట.

యూట్యూబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పవిత్ర పుణ్యక్షేత్రం కోటప్పకొండ వద్ద ఉన్న నగరవనంలో కార్తీక మాస వన సమారాధన మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట శాసనసభ్యుడు డాక్టర్ చదలవాడ అరవింద బాబు, జిల్లా రెవిన్యూ శాఖ అధికారి మురళి, డీఎస్పీ హనుమంతరావు, తహసిల్దార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా జర్నలిస్టులకు క్రికెట్, చెస్, క్యారమ్స్, తాడు లాగు పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో డి.ఎస్.పి హనుమంతరావు క్రికెట్ ఆడి రెండు బాల్స్ లకు రెండు పోర్లు కొట్టి అలరించారు.ఈ పోటీల్లో గెలుపొందిన జర్నలిస్టులకు బహుమతులు నాయకులు అందించారు. వన భోజనాలు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి,వన సమారాధన కార్యక్రమం ఘనంగా ముగించారు.

Post Comment

You May Have Missed

0Shares