సిరియా అధ్యక్షుడు కు ఎంత మంది భార్యలు..

రాజధానివాయిస్:

 

వాషింగ్టన్.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సిరియా నూతన అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా మధ్య ఇటీవల జరిగిన సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ భేటీ సందర్భంగా ట్రంప్, అల్-షరాకు ఒక పెర్ఫ్యూమ్ బాటిల్‌ను బహుమతిగా అందించారు. ఇది మంచి సువాసన వెదజల్లుతుందని, మీకు మీ సతీమణికి బాగుంటుందని చెప్పారు. అదే సమయంలో, “మీకు ఎంత మంది భార్యలు?” అని అల్-షరాను ట్రంప్ ప్రశ్నించారు.

దీనికి సిరియా అధ్యక్షుడు “ఒక్కరే” అని సమాధానం ఇవ్వగా.. ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, “అది నిజమా? నమ్మలేకపోతున్నా” అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Post Comment

You May Have Missed

0Shares