రాజధాని వాయిస్:అక్టోబర్ 23,చిలకలూరిపేట.
చిలకలూరిపేట పట్టణం గుండయ్యతోటకి చెందిన ధూపాటి భులక్ష్మి (39) భర్త వరదయ్య, అనే మహిళకు, నిందితుడైన బత్తుల శ్రీనివాస్ (35) తండ్రి వెంకయ్య మట్టపల్లి గ్రామం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం పరిచయమయ్యాడు. తాను డీఎస్పీనని నమ్మబలికిన శ్రీనివాస్, భూ లక్ష్మి పిల్లలకు పోలీస్ ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఇందుకోసం కొంత డబ్బు ఖర్చవుతుందని చెప్పాడు. నిందితుడి మాటలు నమ్మిన భులక్ష్మి, ఉద్యోగాల ఆశతో అతనికి 30 వేలు ఇచ్చింది. నిందితుడు గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్దకు తీసుకెళ్లి, బయట ఉండమని చెప్పి లోపలికి వెళ్లి కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చాడు.ఆ సమయంలోతాను తెచ్చుకున్న పోలీసు దుస్తులు, కొడుకు పేరు మీదున్న బ్యాడ్జి, లాఠీ, టోపీ, మరో బ్యాడ్జిని నాగ లక్ష్మి కి ఇచ్చాడు. ఇంటికి వచ్చిన తరువాత, తన బంధువుల ద్వారా డబ్బులు ఇస్తే పోలీస్ ఉద్యోగాలు రావని తెలుసుకున్న భులక్ష్మి, మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పటణ పోలీసులు బుధవారం ముద్దాయిని అరెస్ట్ చేసారు.



Post Comment