20 లక్షలతో నూతన సీసీ రోడ్లు ఏర్పాటు

రాజధాని వాయిస్:వెల్దుర్తి.అక్టోబర్ 24

ఉప్పలపాడు గ్రామంలో 20 లక్షల నిధులతో నూతన సిసి రోడ్లకు భూమి పూజ చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి తనయులు జూలకంటి సాయి వివేకానంద రెడ్డి టిడిపి యువనేత జూలకంటి అక్కిరెడ్డి తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దొండపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నూతన సీసీ రోడ్లను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని మాచర్ల నియోజకవర్గంలో గ్రామ గ్రామాన అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడుతుందని ముఖ్యంగా 75 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువత బంగారు భవిష్యత్తు కోసం అహర్నిశలో శ్రమిస్తున్నారని దేశ విదేశాలు తిరిగి కంపెనీలను తీసుకొస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నర్రా గురువారెడ్డి, సామినేని శ్రీనివాసరావు, యాగంటి మల్లికార్జున రావు , పోలగాని రవి, మరియు అధికారులు, పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares