లయన్స్ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల (అక్షయ) ఆధ్వర్యంలో శ్రీనివాస రామానుజన్ జన్మదిన వేడుకలు
రాజధాని వాయిస్:,డిశంబర్ 22,పిడుగురాళ్ల.
మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ నందు సీనియర్ మాథ్స్ టీచర్ గుమ్మడిదల పుల్లారావు మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ లో పనిచేస్తున్న మాథ్స్ టీచర్స్, లయన్స్ క్లబ్ఆఫ్ పిడుగురాళ్ల (అక్షయ) సభ్యులు జాతీయ నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా ఘనంగా సత్కరించడం జరిగినది. పట్టణంలో స్కాలర్స్ జూనియర్ కాలేజీలో ఇరవై సంవత్సరాలుగా మాథ్స్ లెక్చర్స్ గా పని చేస్తున్నటువంటి దుర్గాప్రసాద్ మాస్టారు ,శీను మాస్టారు, మాధవి మేడం నవీన్ మాస్టర్, ఘనంగా సత్కరించి, ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ లో ప్రతిభ చూపిన విద్యార్థి విద్యార్థులకు అలానే శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్ర మీద క్విజ్ నిర్వహించి విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగినది. స్కాలర్ స్కూల్ నందు సీనియర్ లెక్కలు మాస్టారు అయినటువంటి శీను మాస్టారు కూడా ఈ సందర్భంగా ఘనంగా సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పిడుగురాళ్ల అధ్యక్షులు ఆవుల జనార్దన్ రావు ,పల్నాడు జోన్ చైర్మన్ టంగుటూరి సతీష్ కొత్త కాశీ విశ్వనాథం, పిడుగురాళ్ల లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు గుండా నారాయణ ,ఆముదాల చిన్న గంగాధర్ రావు, య డవల్లి ఏడుకొండలు దీకొండ వెంకటస్వామి గుండా రమేష్, సత్యం మాస్టారు మొదలైన లయన్స్ క్లబ్ సభ్యులు ఉపాధ్యాయులు విద్యార్థి నీ విద్యార్థులు పాల్గొనడం జరిగినది.
Post Comment