స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర పై అవగాహన కార్యక్రమం
రాజధాని వాయిస్ :అక్టోబర్ 18
రేపల్లె. రెవెన్యూ డివిజనల్ అధికారి వారి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో భాగంగా రేపల్లె ఓల్డ్ టౌన్ నందు అంకమ్మ చెట్టు వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ రామలక్ష్మి మాట్లాడుతూ, ప్రజలకు స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన జీవనం కోసం ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రత ద్వారా ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని, ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అనగాని శివప్రసాద్ , తాహశీల్దార్ , మున్సిపల్ కమిషనర్ , అలాగే స్థానిక పాఠశాల విద్యార్థులు పాల్గొని మానవహారంగా ఏర్పడి అనంతరం ర్యాలీ నిర్వహించారు.



Post Comment