సైకో పేటీఎం బ్యాచ్ రెచ్చిపోతే తాటతీస్తాం..!
తరాలు మారిన పిన్నెల్లి సోదర్ల నేర చరిత్రను మరవరు ..!
జల్ జీవన్,అమృత్ స్కీములతో తాగునీటికి శాశ్వత పరిష్కారం..!
వరికపూడిశెల పూర్తి చేసి జాతికి అంకితమిస్తాం..!
మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మాంనందరెడ్డి
రాజధాని వాయిస్ : ఫిబ్రవరి 28
మాచర్ల :
వైసీపీ సైకో పేటిఎం బ్యాచ్ రెచ్చిపోతే తాటతీస్తామని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి హెచ్చరించారు. శనివారం స్ధానిక 28. 29 వ వార్డుల నందు పర్యటించి, ఆయన వార్డుల్లో రూ. 2.55 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లును, డ్రైనేజీలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో విషపు రాతలు రాస్తున్న వైసీపీ పేటీఎం టీం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. త్వరలో బ్లూ బ్యాచ్ కు బుద్ధి చెప్తుమని మండిపడ్డారు. రెండు దశాబ్ధాలుగా మాచర్ల నియోజకవర్గాన్ని దారుణంగా దోచుకుని, దందాలకు పాల్పడిన పిన్నెల్లి సోదర్లు అవినీతిని తరతరాలు చెప్పుకుంటాయని విమర్శించారు. నియోజకవర్గాన్ని లూటీ చేసి.., ప్రజా సమస్యలను గాలికొదిలేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే మాచర్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధి జరుగుతుంటే, అది చూసి ఓర్వలేక సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు దిగుతూ.., పేటీఎం సైకోలు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శించడానికి విషయం లేక, చేస్తున్న విష ప్రచారాన్ని మానుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆయన హెచ్చరించారు.
జల్ జీవన్, అమృత్ స్కీములతో తాగునీటికి శాశ్వత పరిష్కారం..!
కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు, డ్రైనేజీలు, తాగు, సాగు నీటికి సంబంధించిన ప్రాజెక్టు పనులు పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే జూలకంటి వెల్లడించారు. నియోజకవర్గంలో దాదాపు రూ. 1200 కోట్ల జల్ జీవన్ పనులు, రూ.130 కోట్లతో ప్రారంభంకానున్న అమృత్ స్కీమ్ ప్రాజెక్టుల పూర్తితో అనాదిగా నియోజకవర్గం ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోందన్నారు. ఇప్పటికే పైపులైన్ పనులు గ్రామాల్లో శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. త్వరలో మౌళికవసతుల కల్పనకు మరిన్నీ శంకుస్ధాపనలు జరుగుతాయని చెప్పారు.
వరికపూడిశెల పూర్తి చేస్తాం ..!
పల్నాడు ప్రజల జీవ నాడి వరికపూడిశెలను కూటమి ప్రభుత్వ హయంలో సీఎం చంద్రబాబు పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తారని ఎమ్మెల్యే జూలకంటి పునరుద్ఘాటించారు. రూ. 3,100 కోట్లతో నిర్మిస్తున్న అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు త్వరలోనే శంకుస్ధాపన కార్యక్రమాలు పూర్తి చేసుకుని, పనులు ప్రారంభిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వరికపూడిశెల పూర్తి అయితే, వేల ఎకరాలకు సాగు, లక్షలాది మంది తాగు నీరు అందుతోందని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో ఆయన వెంట కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.



Post Comment