సేవా తత్పురుషుడు డాక్టర్ కోడెల శివరామ్ 

రాజధాని వాయిస్:నవంబర్ 8,నరసరావుపేట.

 

నరసరావుపేట పట్టణంలో రాజగారి కోటలో డాక్టర్ కోడెల హాస్పిటల్ నందు డాక్టర్ కోడెల శివప్రసాదరావు మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్టు,శంకర నేత్రాలయం ఆధ్వర్యంలో ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం రాష్ట్ర తెలుగు దేశంపార్టీ ప్రదాన కార్యదర్శి డాక్టర్ కోడెల శివరాం ప్రారంభించారు.ఈ సందర్బంగా అవసరమైన వాళ్లకు మందులు, కళ్ళజోళ్ల పంపిణీ చేశారు. అనంతరం హాస్పిటల్ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కోడెల శివరామ్.ఈ సందర్బంగా వైద్య శిబిరానికి హాజరైన వాళ్ళు మాట్లాడుతూ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు ఆశయ సాధనలో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి,ఎంతో మంది కళ్లల్లో వెలుగులు నింపుతూ,ఆకలితో అలాంటించకుండా వైద్య శిబిరంకు వచ్చిన వాళ్ళుకు అన్నదానం చేసి ఆకలి తీర్చిన సేవా తత్పురుషుడు డాక్టర్ కోడెల శివరామ్ కు కృతఙ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ లు,వైద్య సిబ్బంది,డాక్టర్ కోడెల అభిమానులు తదితరుల పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares